May 6, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

నర్సాపురం పిహెచ్ సి సంఘటన పై సమగ్ర విచారణ చేయండి. డియం & హెచ్ఓ తో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఏలూరు: ఆగష్టు, 06 :జై భారత్ వాయిస్’   టి.నర్సాపురం మండలం, అల్లూరి సీతారామరాజు మెట్ట గ్రామానికి చెందిన వగల అలిమేలు మంగ (23) భర్త రాము. గత నెల జూలై 27వ తేదీన జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగి మగబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆమె ఆనారోగ్య పరిస్థితుల కారణంగా టి.నర్సాపురం పిహెచ్ సికి తీసుకువచ్చారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చింతలపూడి ఏరియ ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకురాగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. బంధువులు ఆమె భౌతిక కాయంతో టి. నర్సాపురం పిహెచ్ సి దగ్గర ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణం స్పందించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడారు. సంఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు 

Related posts

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

Sambasivarao

నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే పంపిణీ మంత్రి కొలుసు పార్థసారథి.

KATURI DURGAPRASAD
Notifications preferences