ఏలూరు: ఆగస్టు 06:జై భారత్ వాయిస్’ చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు (35) మృతి చెందడంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే స్పందించారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమలు విజృంభించి డెంగ్యూ జ్వరాలు వ్యాపించాయి.పారిశుధ్యం మెరుగుపరిచి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
