జై భారత్ వాయిస్ కాకినాడ
కాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ కావ డం లేదని పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు గత ఆరేళ్లుగా కార్పోరేషన్ లో ఈ తీరు కొనసాగుతున్నదన్నారు. క్రింది స్థాయిలో అంతర్గత బదిలీలు కూడా జరగడం లేదన్నారు. ఈ తీరు వలన పౌర సమస్యల పరిష్కారంలో జవాబు దారీతనం ప్రధాన సమ స్యలను నివృత్తి చేయడంలో పారదర్శకత పూర్తిగా కరువయ్యిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2నెలలవుతున్నా కార్పోరేషన్ లో ప్రక్షాళన జరగలేదన్నారు. కొత్త సీసాలో పాత సారా చందాన పాలన నడుస్తున్న దుస్థితి నగర ప్రగతికి దోహదం కాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది ప్రయివేటు ఉద్యోగులతో ప్రతి పనికి మొత్తం చందాన కలెక్షన్స్ దందా యధావిధిగా వుందన్నారు. ఖాళీ స్థానాల్లో ఉద్యోగ సిబ్బంది నియామకం లేకపోవడం వలన కార్పొరేషన్ లోని ప్రతి విభాగంలో ప్రయివేట్ కలెక్షన్ గ్యాంగ్ ముదిరి పోయిందన్నారు. కార్పోరేషన్ లో తరచుగా పనిచేసేకమీషనర్లు మారడం దురదృష్టకర మన్నారు. క్రింది స్థాయి అవినీతిని నిర్మూలించే ప్రణాళిక జరగాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు.నగర పాలక సంస్థలో కోట్లాది రూపాయల దుర్వి నియోగం జరుగుతున్నా స్మార్ట్ సిటీగా ఏర్పడిన 2016 నుండి 8 ఏళ్లుగా విజి లెన్స్ ఏ సి బి విచారణలు దర్యాప్తులు కరువై అవినీతి వటవృక్షంగా తయారయ్యిందన్నారు. బర్త్ సర్టిఫికెట్ నుండి సాధారణఇంటి ప్లాను మంజూరు వరకు వందల నుండి వేల స్థాయిలో కరెన్సీ పంపిణీ లేకుండా పనులు కావడం లేదన్నారు.
previous post