హిరోషిమా, నాగసాకి పై అమెరికా మానవ వినాశనానికి ఉపయోగించిన అను బాంబు వల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అయిందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఆచార్య లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన ఆర్ట్స్ కళాశాల, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో “హిరోషిమా ప్రపంచ శాంతి దినోత్సవం” సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మంచికి ,చెడుకు ఉపయోగిస్తున్నారని, అయితే అమెరికా అనుబాంబును తయారు చేసే ఇది పనిచేస్తుందా లేదా అనే దానిపై ముందుగా సముద్రంలో ప్రయోగించారని అయితే దాని ప్రభావం పూర్తిగా తెలవకపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికా హిరోషిమా పై1945 ఆగస్టు ఆరవ తేదీన బాంబులు వేశారని, ఆ మరుసటి రోజు నాగసాకి పై కూడా బాంబులు కురిపించారని, దీనివల్ల గంట వ్యవధిలోనే రెండు లక్షల మంది ప్రజలు మరణించారన్నారు. ఇంత మానవ వినాశనానికి అనుబాంబు వినియోగం జరిగిందన్నారు. దీనివల్ల సైన్స్ దుర్వినియోగం అవుతుందని నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భద్రత పేరుతో మానవ వినాశ అను బాంబులను తయారు చేసి పెడుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ సైన్స్ మానవ జీవనాన్ని మెరుగుపరచడంలోనూ, నాగరికతను విస్తారం చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, వ్యవసాయము విద్య వైద్యం ఉష్ణోగ్రతల నియంత్రణ సైన్స్ తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి అటవీ శాఖ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ నేడు పర్యావరణ సమస్య అధికంగా ఉందని, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం, ఆహార పదార్థాలలో రంగులు వినియోగం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, వీటివల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వ్యాప్తి చెందుతాయని వీటిని నియంత్రించుటకు న్యూట్రిషన్ ఆహారాన్ని తీసుకోవాలని, సైన్స్ సూచించిన విధానాలను పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పుల్లా రమేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, శ్రవణ్ కుమార్, అవయవ దాన సంస్థ జిల్లా అధ్యక్షులు సదయ్య, కళాశాల సహాయక రిజిస్టర్ అశోక్ బాబు, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
next post