జై భారత్ వాయిస్ విజయవాడ
‘విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపాల్గొన్నారు ముఖ్యమంత్రి, గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు పండించటానికి, తయారు చేయటానికి, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి, అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు.గిరిజనులు తయారు చేసిన కాఫీని త్రాగారు. ఆయన త్రాగడంమేకాకుండా అక్కడున్నవారందరికి కాఫీ త్రాగించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూఅంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు శుభాకాంక్షలు.తెలిపారు.జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని.అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించామని అన్నారు.గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమేనని రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని తెలియజేశారు.అందరికంటే గిరిజనుల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పేదరికం లేని సమాజంతోనే, గిరిజనుల కష్టాలు తొలగుతాయని. గిరిజనులను అన్ని విధాలుగా పైకి తీసుకుని వచ్చేందుకు, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.గిరిజన ప్రాంతంలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం. ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇచ్చే ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నామని డీఎస్సీ కోసం గిరిజనులకి శిక్షణ ఇచ్చి గతంలో ఇచ్చిన విధంగా, గిరిజన యువతకి ఇన్నోవా కార్లు ఇస్తామని అర్హులైన అందరికీ లోన్లు ఇస్తామన్నారు.
