Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఇరుకుళ్ళ వెంకటేశ్వర్లు , ఆనాటి ఉపాధ్యాయులు సయ్యద్ అలీ అక్బర్, కందుకూరి దేవేంద్రాచారి కశ్వోజ్వల రమణాచారి, రాపెల్లి నర్సింహస్వామి, తాడ మోహన్ రెడ్డి, బెజ్జెంకి బ్రహ్మయ్య, తాబేటి వెంకటేశ్వర్లు గార్లను విద్యార్థులు గౌరవ మర్యాదలతో సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుత పాఠశాల హెడ్మాస్టర్ మిడివెళ్లి పట్ట్టాభి ముఖ్య అతిథులుగా హాజరు కాగా పూర్వ విద్యార్థి , ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డా||ముత్తినేని రాధాకృష్ణ సమన్వయకర్త గా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో దాదాపు 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ,పాఠశాలలో అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇకపై నుంచి తమ బ్యాచ్ పూర్వ విద్యార్థుల్లో శుభాశుభ కార్యక్రమాల్లో పాల్గొంటామని, ఎవరికైనా అనుకోని ఆపదలు వచ్చినప్పుడు సంఘటితమై ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారుల బస్సు చైతన్య యాత్ర

18న కలెక్టరేట్ ను జయప్రదం చేయండి

గోపు సుగుణమ్మ పార్థివ దేహానికి నివాళులు

Sambasivarao