May 15, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

జై భారత్ వాయిస్ హన్మకొండ ఆగస్టు 13
వాహనదారులు ఎవరు తమ కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి వాహనదారులకు సూచించారు. ట్రైసిటి పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీలో ట్రాఫిక్‌ మరియు లా అండ్‌ అర్డర్‌ పోలీసులకు పట్టుబడిన వాహనదారులకు వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ట్రాఫిక్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్‌ ఎసిపి ముఖ్య అతిధిగా హజరయి వాహనదారులు, వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో అధికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వున్నారు. వీరి మరణంతో ఈ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని. వాహన దారుడు మద్యం సేవించి వాహనం నడటం ద్వారా రోడ్లపై వేళ్ళే పాదచారులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారని. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు కోల్పోపోడంతో పాటు వారి కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులకు గురౌవుతున్నారని. ఈ సంవత్సరంలో ట్రై సిటి పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబంధించి మొత్తం 5410 కేసులు నమోదు కావడంతో పాటు 60 మంది వాహనదారులకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జైలు శిక్షలు విధించడం జరిగిందని అలాగే మరో 5095 మంది వాహనదారులు జరిమానాలు చెల్లించారని ట్రాఫిక్‌ తెలియజేసారు. ఇక పై వాహనదారుడు మద్యం సేవించి వాహనం నడపడాన్ని కుటుంబ సభ్యులే వ్యతిరేకించాలని ట్రాఫిక్‌ ఎసిపి తెలియజేసారు. ఈ కార్యక్రమములో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇంచార్జ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్‌.ఐ బుచ్చి రెడ్డి ఇతర ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

వివాహానికి ఆర్థిక సహాయం

Jaibharath News

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

Jaibharath News

దామెరలో పోలీస్ కవాతు

Notifications preferences