Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

జై భారత్ వాయిస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి కానిస్టేబుల్ నమిండ్ల సాధన్ పాఠశాలకు త్రాగునీటిని శుభ్ర పరిచే ఆర్ ఓ మినీ వాటర్ ప్లాంటుని బహుకరించారు. ఈ సందర్భంగా నమిండ్ల సాధన్ మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు జ్యోతిర్మయి మాట్లాడుతూ చాలా కాలంగా మా పాఠశాలకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్న సాధన్ సేవలు చాలా అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు పాఠశాలకు సాధన్ చేస్తున్న సేవ కార్యక్రమాలను గ్రామ పూర్వ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పాఠశాలకు ఆర్ ఓ మినీ వాటర్ ప్లాంటుని బహుకరించిన పూర్వ విద్యార్థి కానిస్టేబుల్ సాధన్ ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు నమిండ్ల క్లిమెంట్, ఎలగొండ ప్రవీణ్, నమిండ్ల కిరణ్, మాచర్ల కార్తీక్, సిలువేరు రవి, ఇంద ఆరోగ్యం, సిలువేరు సుమను తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలినమిండ్ల క్లైమేoట్ మాదిగ

ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగి సురేష్

Sambasivarao