Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

వరంగల్ జిల్లా//రాయపర్తి మండలం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-ప్రతి ఒక్క యువకునిలో దేశ భక్తి నింపడమే బీజేవైఎం ముఖ్య లక్ష్యం. దేశ విచ్చిన్నకర శక్తులను దేశం నుంచి తరిమికొట్టడమే బీజేవైఎం లక్ష్యమని బీజేవైఎం వరంగల్ జిల్లా కార్యదర్శి రాపాక ప్రశాంత్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం రాయపర్తి మండల ప్రధాన కార్యదర్శి మంచాల సుమన్ యాదవ్ అధ్యక్షతన   తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాపాక ప్రశాంత్ పాల్గొన్నారు. అదేవిధంగా రాయపర్తి మండల బీజేపీ అధ్యక్షులు వడ్లకొండ  రవి, జిల్లా నాయకులు గడ్డం నరేందర్, నూనె అనిల్ బిజెవైఎం నాయకులు పెండ్యాల గణేష్ జండా ఊపి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ప్రభుత్వ పాఠశాల నుండి బస్సుస్టాప్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి  రాపాక ప్రశాంత్   మాట్లాడుతూ దేశంలో జాతీయ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మండల జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారని దేశం కోసం ధర్మం కోసం పరితపించే యువతకు మన దేశభక్తి యొక్క విలువలు తెలిచేయడం జరుగుతుందని తెలిపారు.దేశాన్నీ విచ్చిన్నం. చేసే శక్తి నుంచి దూరంగా ఉంటూ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరుపైఉందని తెలియజేశారు.  దేశం స్థిరంగా ఉండాలంటే అది బిజెపితోనే సాధ్యమని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ రక్షణ కవచంగా ఏర్పడిందని కొనియాడారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో సబ్కాసాత్ సబ్కా వికాస్ అనే కార్యక్రమంలో నడుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమములో బీజేవైఎం  నాయకులు జక్కుల సందీప్, రాసాల రాకేష్, ఉడుత నాగరాజు, రాకేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ వాలంటరీగా ఉపాధి కల్పించిన సీఎంరేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Sambasivarao

గీసుగొండ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం

Jaibharath News

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం