వరంగల్ జిల్లా//వర్ధన్నపేట
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-తమతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి 35 వేల రూపాయలు ఆర్థిక సహయం చేసి తమ మంచి మనసును చాటుకున్నారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో జెడ్పి ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ( 1985- 1989) వరకు కలిసి చదువుకున్న వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కలువల సత్తయ్య (51) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో సమాచారం తెలుసుకున్న బాల్యమిత్రులు మంగళవారం మృతి చెందిన చిన్ననాటి మిత్రుడు కలువల సత్తయ్య ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏడు దొడ్ల జ్యోతి, మొట్టక ఎల్లయ్య, బాబా ఫక్రుద్దీన్, మామిడాల పూర్ణం చందర్, దామెర మల్లయ్య, మునిగాల వేణుమాధవ్, సిద్ధం లింగయ్య, మెరుగు సమ్మయ్య, బైరి ఉపేందర్ రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

previous post