జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ
పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోస్టల్ ద్వారా సందేశాన్ని పంపారు . మంగళవారం విజయవాడ శాసన సభ్యుని కార్యాలయంలో ఈ పోస్ట్ కార్డ్ సందేశాన్ని , జాతీయ జెండాను విజయవాడ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్వయం గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అందచేశారు. ఈ ఆగస్టు 15 న తిరంగాను ఎగురవేసి తిరంగాతో సెల్ఫీ తీసుకుని హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సందేశంలో కేంద్ర మంత్రి తెలిపారు .ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
previous post

