జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వరంగల్ జిల్లా ప్రతినిధి: జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరం నుండి జనగామ నియోజకవర్గం వరకు కూడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అర్బన్ డెవలప్మెంటులో భాగంగా జనగామ మండలంలోని పలు గ్రామాలను కలుపుతు కుడా రూపొందించిన రూట్ మ్యాప్ ను మరియు కూడాలో ఇంకొన్ని గ్రామాలను కలపాల్సిన ఆవశ్యకత దానివల్ల జరుగు ప్రయోజనాలను డెవలప్మెంట్ అంశాలను జనగామ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సిపిఎం ప్రతినిధి బృందంతో చర్చించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా జనగామ పట్టణంలో మంచినీటి శుద్ధమైన జలాలు ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణంలోని బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టాలని శివారు ప్రాంతాలలో రోడ్ల సమస్య పరిష్కరించాలని హుస్నాబాద్ జనగామ రోడ్డుపై గానుగుపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని వడ్లకొండ చీటకోడు వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని వ్యవసాయ ఆధారితమైన జనగామ నియోజకవర్గంలో పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు కృషి చేయాలని విద్యాపరంగా జనగామకు పాలిటెక్నిక్ కాలేజ్ చెంపకి హిల్స్ గిరిజన వెల్ఫేర్ హాస్టల్ లో గదుల నిర్మాణం సౌకర్యాలు కల్పించాలని చెంపకహిల్స్ లో పీజీ కాలేజీకి కేటాయించిన స్థలంలో కాలేజీ నిర్మాణ పనులు చేపట్టడం కోసం చర్యలు చేపట్టాలని కవులు కళాకారులు కళలకు నిలయమైన జనగామ జిల్లా కేంద్రంలో కళల అభివృద్ధి కోసం భవన నిర్మాణం స్థలం కేటాయించాలని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మందులు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈసందర్భంగా వారు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఏసమయంలోనైనా ప్రజా సమస్యల నియోజకవర్గ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చని తన శాయశక్తుల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్ని పక్షాల భాగస్వామ్యంతో జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రతినిధి బృందంలో సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు సాంబరాజు యాదగిరి ఇర్రి అహల్య సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ భూక్యా చందు నాయక్ తదితరులు ఉన్నారు.
