Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ జిల్లా
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి: పవర్ లూమ్ నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందే విధంగా సహకారం అందిస్తాని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య తెలిపారు. సిడ్బీ, సిఐపి కింద అందించే కార్యక్రమాల్లో నేత కార్మికులు పాల్గొని ఉత్తమ పద్ధతులను అవలంబించాలని ఎంపీ సూచించారు. నేత కార్మికులకు సంబంధించిన తన మాటలను కవిత రూపంలో కూడా వ్యక్తపరిచారు. టెక్టైల్స్ పార్క్ నందు పవర్ లూమ్ క్లస్టర్ సూరత్, సోలాపూర్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం స్మృతి, ప్రొఫెసర్ పద్మనాభం, గౌరవ అధ్యక్షుడు స్వామి, అధ్యక్షుడు శ్రీరాములుతో నేత కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

8 నుంచి ఊరుగొండ ‌‌లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవాలు,జాతర

Jaibharath News

రిఫండ్ కోసం తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అదనపు డీసీపీ రవి

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

Jaibharath News