Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుగొండ మండలం మచ్చాపూర్, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన కంబాల శ్రీనివాస్,మామిండ్ల లక్ష్మీ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా GWMC 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కక్కర్ల అనుదీప్,అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ రఫీలను మాజీ ఎమ్మెల్యే గారు పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే గారి వెంట పరామర్శించిన వారిలో మాజీ జడ్పీటిసి పోలీసు ధర్మారావు మాజీ సర్పంచులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Related posts

కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక

బాదిత కుటుంబాన్ని పరామర్శ

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.