Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నూతన భవనంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్‌ వెల్ఫెర్‌ కన్‌స్యూమర్‌ స్టొర్స్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం ప్రారంభించారు. ఆతి తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులతో పాటు ఇతర గృహోపకరణాలను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు విక్రయించడం జరుగుతొంది. ఈ స్టోర్స్‌యందు ఎక్కువ వస్తువుల విక్రయాలు కోనసాగుతుండదంతో మరిన్ని అదనపు నిత్యవసర వస్తువులను ఏర్పాటుకు అవసరమైన అదనపు కొసం నూతనంగా భవనంలోకి పోలీస్‌ వెల్ఫెర్‌ కన్‌స్యూమర్‌ స్టొర్స్‌ను తరలించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ ఈ పోలీస్‌ వెల్ఫెర్‌ కన్‌స్యూమర్‌ స్టొర్స్‌ నుండి వస్తువుల తొలి కొనుగొలు చేసి వస్తువుల విక్రయాలను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు పోలీస్‌ సిబ్బందికి అందించడమే వెల్ఫెర్‌ కన్‌స్యూమర్‌ స్టొర్స్‌ ప్రధాన లక్ష్యమని, రానున్న రోజుల్లో సిబ్బందికై సంక్షేమ కార్యక్రమాలను నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారుఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు సంజీవ్‌, సురేష్‌కుమార్‌, ఏసిపిలు అనంతయ్య, విజయ్‌ కుమార్‌, ఆర్‌.ఐలు సతీష్‌, స్పర్జన్‌రాజ్‌, శ్రీధర్‌, శ్రీనివాస్‌, ఆర్‌.ఎస్‌.ఐ శ్రవణ్‌కుమార్‌, స్టోర్స్‌ ఇంచార్జ్‌ మధు, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌తో పాటు స్టోర్స్‌ సిబ్బంది ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

Check Out Valve’s New VR Controller Prototype In Action

Jaibharath News

Meet the Nokia 8 — The First Android Flagship From The Iconic Brand

Jaibharath News

Financial Gravity Hosts AI Design Challenge For Tax Planning Software

Jaibharath News