వరంగల్ జిల్లా//పర్వతగిరి మండలం//జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు14 వర్ధన్నపేట డివిజన్:- పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టరుగా బి రాజగోపాల్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీనివాస్ సస్పెండ్ కావడంతో… అతని స్థానంలో రాజగోపాల్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో పాత ఖమ్మం జిల్లా కొత్తగూడెం, చర్ల, బయ్యారం, ఇల్లందు తదితర ప్రాంతాల్లో పనిచేసే, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు.
