హనుమకొండ జిల్లా//కోర్టు సెంటర్
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 హన్మకొండ ప్రతినిధి:-సామాజిక న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి డిఇఓ ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ హనుమకొండ నందు వాల్ పోస్టరును ఆవిష్కరించిన ఐ ఎల్ పి ఎ నాయకులు. సామాజికన్యాయ పోరాటంలో బహుజన న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు పొన్నం దేవారాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని వరంగల్ బార్ అసోసియేషన్ లో వరంగల్ బార్ అద్యక్షులు తీగల జీవన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలని, స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా, స్వేచ్ఛ, సమానత్వం కోసం రాజ్యాంగం వ్రాసుకున్నా 90 శాతం ప్రజలకు ఇంకా న్యాయం జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, మాజీ అధ్యక్షులు అంబరీష్ రావు, తాల్లపల్లి జనార్ధన్ గౌడ్, చిల్లా రాజేంద్రప్రసాద్, ఆనంద్ మోహన్, బార్ కౌన్సిల్ సభ్యులు దుస్స జనార్ధన్ మాట్లాడుతూ సామాజిక న్యాయ సమరంలో రాజ్యాంగం, చట్టం తెలిసిన న్యాయవాదులు ముందుండాలని, బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారివాటా వారు సాధించు కోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 న హైదరాబాదులో జరుగు బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సుకు న్యాయవాదులు హాజరై వియవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్క్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు మాధవ కృష్ణ, సాయిని నరేందర్, నరహరి, వరంగల్ బార్ అససియేషన్ ఉపాధ్యక్షులు పగడాల సుదర్శన్, హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి లడే రమేష్, మాజీ ప్రధానకార్యదర్శి గునిగంటి శ్రీనివాస్, న్యాయవాదులు పులి సత్యనారాయణ, ఆంజనేయులు గౌడ్, దయాల సుధాకర్, కోటేశ్వరరావు, బొమ్మ నాగరాజు, యుగేందర్, రాయబారపు భిక్షపతి, అనిల్, వినయ్, సుందర్ రామ్, రామనాథం, జిలకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
