Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు

78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు,

జై భారత వాయిస్, కుందుర్పి

ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర సమరయోధులకు సలాం. 78వ స్వాతంత్ర్యం సంబరాలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారత్‌ దేశం సిద్ధమైంది. తెల్లదొరల పాలనకు చరమగీతం పాడుతూ 1947 ఆగష్టు 15వ తేదీనభరతమాతస్వేచ్ఛావాయువును పీల్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఉన్నారంటే నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరగక పోరాడిన సమరయోధులు కష్టార్జితమే. బ్రిటీషు వారిని ఎదుర్కొని ప్రాణాలను పనంగా పెట్టి మన దేశానికిస్వాతంత్ర్యంసంపాదించారు. ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నినాదం వికసిత్ భారత్ అంటే భారతదేశాభివృద్ధి. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది.ఏటా భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చారిత్రాత్మక ఎర్రకోటపైనే నిర్వహించడం ఆనవాయితీ. దేశ ప్రధాని ఎర్రకోట నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ సారి ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 11వ సారి దేశానుద్దేశించి ప్రసంగిస్తారు.

Related posts

కుందుర్పిలో గణతంత్ర దినోత్సవం వేడుకల

Jaibharath News

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్ టీం

Jaibharath News

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి

Gangadhar