హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:విద్యార్థుల సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు. కాకతీయ యూనివర్సిటీలోని బాయ్స్ కామన్ మేస్సులో యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం రోజున బాయ్స్ కామన్ మెస్ లో విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని పెట్టడం వలన కాళీ పేట్లతోని అలాగే అన్నం డబ్బాలతోని కామన్ మేస్ నుండి ర్యాలీగా మొదటి గేటు వరకు వచ్చి గేటు ముందు 300 మంది విద్యార్థులు ధర్నా చేయడం జరిగిందన్నారు విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెట్టడంవల్ల బయటికి వెళ్లి డబ్బులు పెట్టి తిని వస్తున్నారు గత పదిరోజుల క్రితమే రిజిస్టరుకి ఈ సమస్యలపై చెప్పిన పట్టించు కోలేదన్నారు విద్యార్థులకు విపరీతంగా మెస్ బిల్లులు పెంచుతున్నారు కానీ వారికి నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదన్నారు అన్నం మొత్తం పలుకు పలుకు అవుతుంది తిందామంటే తినే విధంగా లేదన్నారు పేద విద్యార్థుల పోట్ట మీద యూనివర్సిటీ అధికారులు కొడుతున్నారన్నారు యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలంటే కాకతీయ యూనివర్సిటీకి రెగ్యులర్ విసిని నియమించాలన్నారు ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు చొరవ తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు లేదంటే యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు అందరం ఏకమై ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు యూనివర్సిటీ అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు పురుషోత్తం సాయికుమార్ ఉపాధ్యక్షులు బిరెడ్డి జస్వంత్ సహాయ కార్యదర్శి పరిమీళ, కుమ్మరి శ్రీనాథ్, వివేక్, రత్నం, అఖిల్, హత్తిరం, రత్నాకర్, హరిస్టాటిల, భరద్వాజ్, ప్రవీణ్ నాగు కళ్యాణ్, పృథ్వి వేణు, రాకేష్, రాజేష్, యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.