Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ 2024 మూడవ విడత (లక్ష యాభైవేలనుండి 2 లక్షల రూపాయల రుణమాఫి విడుదల చేసిన సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాందీ మరియు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు రైతులతో కలిసి పాలభిషేకం నిర్వహించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి రైతులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న తరుణంలో 3 వ విడత 2లక్షల రూపాయల రుణమాఫీ నిధులను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన శుభసందర్భంగా రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రి వర్గానికి మా ఉమ్మడి జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు మా రైతాంగం తరుపున ప్రభుత్వానికి ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2022 మే 6 వ తేదీన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫి చేస్తామని రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 2 లక్షల రుణమాఫి చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికే సహకార బ్యాంకుల ద్వారా మొదటి విడతలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8151 రైతులకు 35 కోట్ల 89 లక్షల మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23841 మంది రైతులకు 106 కోట్ల 71 లక్ష రూపాయల రుణ మాఫీ చేసామని అన్నారు. రెండవ విడతలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 142 కోట్ల 58 లక్షల రూపాయల రుణమాఫి చేసామని అన్నారు. సహకార సంఘాల ద్వారా రెండవ విడతలో భాగంగా దాదాపు 76 కోట్ల 52 లక్షల రూపాయలు రుణమాఫి చేసామని అన్నారు. ఈ మూడో విడతలో రాష్ర్ట వ్యాప్తంగా 2 లక్షల పంట రుణాలున్న సుమారు 6 లక్షల రైతాంగానికి దాదాపు 6 వేల కోట్లు రుణమాఫి చేస్తున్నామని అన్నారు. ఆధార్‌ నెంబర్‌, బ్యాంకు ఖాతా నెంబర్లుఇతర వివరాలు సరిగా లేకపోవ డం వంటి కారణాలతో కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదని ఎలాంటి అపోహలు అవసరం లేదని తప్పకుండా వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపి అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తాంరుణ మాఫీ అయినా ప్రతి రైతుకు తిరిగి కొత్త పంట రుణాలు మా బ్యాంకుల ద్వారా అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సమ్మక్క జాతరలో అలసత్వం వీడాలి -వరంగల్ కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలీ

Sambasivarao