Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మహబూబాబాద్ జిల్లా//తొర్రూరు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-
బిజెపి తొర్రూర్ అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి మానుకోట జిల్లా కార్యదర్శి, తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్ కొలుపుల శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సంద్రభంగా శంకర్ మాట్లాడుతూ అందరికి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాలతో 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. నేడు 78 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉన్నదని అన్నారు. రూరల్ అధ్యక్షులు కస్తూరి పులేందర్ గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి స్వతంత్ర సమరయోదుల ఆత్మ బలిదానాల ఫలితమే మనకు స్వాతంత్రం సిద్ధించిందని ఆ మహనీయులను ప్రతి ఒక్కరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు. కొండ యకన్న, జలగం రవీందర్, కిన్నెర యాదగిరి, చలువాది సత్యనారాయణ, తూర్పాటి సారయ్య మెండీస్, సర్వీ వెంకటేష్, సాయి, రామూర్తి, దారం కుమారస్వామి, నవీన, చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Jaibharath News

తొర్రూర్ ఎస్ బి ఐ బ్యాంకులో చెలరేగిన మంటలు

కొత్తగూడా మండలంలోని వాగులను పరిశీలిస్తున్న తహసిల్దార్, ఎస్ఐ