*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ*
హన్మకొండ జిల్లా//పోలీస్ పరేడ్ గ్రౌండ్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ… స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.