జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపట్ల మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ అత్యంత ఆవహేళనగా మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటరులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్, కార్పొరేటర్ గుండేటి నరేందర్, మాజీ కార్పొరేటర్లు కత్తెర లక్ష్మణ్, ధూపం సంపత్, జన్ను రవి, ఓబీసీ జనరల్ సెక్రెటరీ వరుణ్, యూత్ కాంగ్రెస్ పరమేష్, గిన్నారపు రాజు, జన్ను ఆదాం, ఐ ఎన్ టి యు సి చంద్రమౌళి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.