జై భారత్ వాయిస్ న్యూస్:వరంగల్ టౌన్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-పోలీస్ కమిషనరును మార్యాద పూర్వకంగా కలిసిన నూతన పోలీస్ ఇన్స్ స్పెక్టర్లు ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేటు లో జరిగిన బదిలీల్లో నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ పులి రమేష్, ఏనుమాముల ఇన్స్ స్పెక్టర్ రాఘవేందర్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ని మార్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహిస్తూ, నిజాయితీ ప్రజలకు సేవాలాందించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు తెలిపారు.