జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం ఉకల్ హవేలీ , మచ్చాపూర్ లో శుక్రవారంగ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం ఇంచార్జ్ వైద్యాధికారి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుత కాల కాలానుగుణంగా సీజనల్ వ్యాధులను తెలుసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమైనది. ఈ శిబిరం నందు జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షల నిమిత్తం రక్త నమోనాలను సేకరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలను పరీక్షించి వారికి సంబంధించిన వ్యాధులకు అనుగుణంగా ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎంలు డి. సదాలక్ష్మి, పి. సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ జె. శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
previous post