Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజా సంక్షేమం శ్రేయస్సే పరమావధిగా ప్రజల సమస్యలను సావధానంగా వింటూ కొండా మురళీధర్ సాధ్యమైనంతవరకు సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోనులో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలను టిఆర్ఎస్ నాయకులకు చెప్పే పరిస్థితి లేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాకాకుండా ప్రజలు పూర్తి స్వేచ్ఛగా తమ సమస్యలను నేరుగా చెప్పవచ్చని తెలిపారు. కొండ దంపతులు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటారని, ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తమను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు ప్రజలకు స్పష్టం చేశారు.

Related posts

సర్పంచ్ ఏకగ్రీవం సొంత పైసలతో బొడ్రాయి పండగ. ఇంటింటికి రూ. 1000

Sambasivarao

గోల్డెన్ ఓక్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

ఉప్పరపల్లి క్రాస్ రోడ్ నుంచి రాయపర్తి మండలం కిష్టాపూర్ క్రాస్ రోడ్ వరకు ప్రమాదాల నివారణకు తగు చర్యలకు సూచన

Sambasivarao