జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 కేయూ క్యాంపస్ ప్రతినిధి:-కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ అరకొర వసతులతో కనీస వసతులైన తరగతి గదులు, బ్లాక్ బోర్డులు, త్రాగునీరు, ముత్రశాలలు, ముట్ కోర్ట్ హాల్, సెమినార్ హాల్, హాస్టల్, వంటివి కూడా లేక విద్యార్థులు అటు బోధన సిబ్బంది తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి బార్ కౌన్సిల్ పేరు మీద కళాశాల పైసలు వసూలు చేస్తున్నప్పటికీ అఫిలేషన్ ఫీజు కట్టడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు లా కాలేజీ నడపడానికి మినిమం నిబంధనలను కళాశాల అధికారులు యూనివర్సిటీ రిజిస్టర్లు మెయింటైన్ చేయకపోవడం పేద మధ్యతరగతి విద్యార్థుల విద్య పట్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈ సంవత్సరం కళాశాల అడ్మిషన్లు ఆగిపోతే విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని ఇక న్యాయ కళాశాల మూసి వేయడం తప్ప మరో మార్గం లేదని ఆపై దాన్ని ఏ కమర్షియల్ కాంప్లెక్స్ కో ఏరియల్ ఎస్టేట్ పెట్టుబడి దారులకు అమ్మేవిధంగా యునివర్సిటీ అధికారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు వెంటనే బార్ కౌన్సిల్ అప్లికేషన్ ఫీజు కట్టి అడ్మిషన్ లను రద్దు కాకుండా చొరవచూపాలని డిమాండ్ చేశారు ఈ సంవత్సరం అడ్మిషన్లు ఆగితే లా కాలేజ్ అగ్నిగుండమై రగులుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి జస్వంత్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్, అజయ్, రాకేష్, సందీప్, ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
