Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

జై భారత్ వాయిస్ న్యూస్  ఆగష్టు 17 వరంగల్ జిల్లా ప్రతినిధి:-అణచివేత తీవ్రమైనప్పుడు, మార్పు అనివార్యమైనప్పుడు వ్యక్తులు విప్లవ శంఖారావాలై  ఉబికి వస్తరని, ఆ విధంగా నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తూ ఉదయించిన బహుజన వీరుడే సర్వాయి పాపన్న గౌడ్ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి (ఆగస్టు 18) సందర్భంగా బహుజన బిడ్డగా పాపన్న గౌడ్ రగిలించిన స్ఫూర్తిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. ఆత్మాభిమానం కోసం, అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం కత్తి పట్టిన యోధుడిగా పాపన్నకు చరిత్రలో సుస్థిర స్థానమున్నదని అన్నారు. పెత్తందార్లు, జమిందార్లు, నాటి మొగలాయి పాలకుల నిరంకుశత్వానికి ఎదురుతిరిగి, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన వీరునిగా సర్వాయి పాపన్న గౌడ్ ప్రజల గుండెల్లో నిలిచే వుంటారని మంత్రి తెలిపారు. సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Related posts

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా