జై భారత్ వాయిస్ న్యూస్: హన్మకొండ
యువత రాబోవు రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ యువత సూచించారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు పదార్థాల నిర్మూలణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుల అధ్వర్యంలో యువతకు 4కె పరుగును నిర్వహించడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కళాశాలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు స్థానిక యువతి, యువకులు పాల్గోన్న ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్‌తో పాటు , వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డా. సత్య శారద, ప్రావీణ్య, ఎన్‌పిడిసిఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డితో పాటు జబర్‌దస్త్ ఫేం అదిరే అభి ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గోన్న విధ్యార్థులు, ముఖ్య అతిధుల చేత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసారు. అనంతరం వరంగల్ పోలీస్ పరేడ్ నుండి ప్రారంభమైన 4కె పరుగును ముఖ్య అతిధులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి ప్రారంభమైన ఈ పరుగును అదాలత్ సెంటర్ వరకు తిరిగి అక్కడి నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వరకు కొనసాగింది. చివరగా ఈ పరుగులో యువతి, యువకుల విభాగాల్లో మొదటగా వచ్చిన ముగ్గురికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ పరుగులో పాల్గోన్న విద్యార్థులు, యువతియువకులను ఉద్యేశిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై వ్యతిరేకంగా యువత ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ పరుగును ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు దూరంగా వుండాలని, మత్తు పదార్థాలు వినియోగించిన, విక్రయించిన నేరమవుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై వుందని, డ్రగ్స్ ఫ్రీ కమిషనరేట్ మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.వరంగల్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుయితే మత్తపదార్థాలకు దూరం వుండాలని, మీ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే మీ కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకోని మత్తుకు పదార్థాలకు బానిసలు కావద్దని తెలిపారు, మత్తు పదార్థాలను సేవించే వారిని తక్కువ చేసి చూడకుండా వారిని చేరదీసి మత్తు పదార్థాలక నుండి దూరం చేసేందుకు మనమందరం ప్రయత్నించాలని హనుమకొండ కలెక్టర్ తెలిపారు. ఎన్‌పిడిసిఎల్ చైర్మన్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోద్దని తెలిపారు. ఈ కార్యక్రమములో డిసిపిలు రవీందర్, రాజమహేంద్రనాయక్,అదనపు డిసిపిలు రవి, సంజీవ్,సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐ, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ జాగృతి కళాబృందంతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
previous post