జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మాత్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరకాల మున్సిపాలిటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన, అమృత 2.0 పథకములకు శంకుస్థాపన మరియు పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు,,తహశీల్దార్ లు, ఎంపిడిఓలు ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.