Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలీ

జై భారత్ వాయిస్ న్యూస్  పరకాల ఆగష్టు 18 -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్.అందచేశారు. పరకాల పట్టణంలో అద్దె భవనంలో నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టలుకు స్థలం కేటాయించి నూతన భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా హనుమకొండ జిల్లా కామలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలకు  నూతన బిల్డింగ్ నిర్మించాలి పరకాల పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. ఆత్మకూరుకు సోషల్ ఎస్సీ గర్ల్స హాస్టలుకు స్థలంకేటాయించి నూతన బిల్డింగ్ నిర్మించాలి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి పెండింగులో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ ఆత్మకూర్ ఇన్చార్జి బొజ్జ హేమంత్తదితరులు పాల్గొన్నారు.

Related posts

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sambasivarao

Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం

యువత భవిష్యత్తులో అభ్యున్నతి సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలి

Sambasivarao