Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు రథం బహుకరణ

జై భారత్ వాయిస్  న్యూస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథంనుదాత తాటికొండ మల్లేశం దంపతులు అందచేశారనిఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున దేవస్థానం ఆవరణలో దేవస్థానం ఈఓ అద్దంకి నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో  మాట్లాడుతూ హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన దాత తాటికొండ మల్లేశం, రమాదేవి దంపతులు దేవుడి పట్ల భక్తితో పాటు కుమారుల జ్ఞాపకార్థం శ్రీశ్రీశ్రీ ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథాన్ని 70 అడుగుల టేకు కర్రతో 10 అడుగుల పొడవుతో, 6.5 వెడల్పుతో తయారు చేసి ఆదివారం అందజేశారని  తెలిపారు.ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రథం ధాత తాటికొండ మల్లేశం,రమాదేవి దంపతులు మాట్లాడుతూ నా కుమారులు తాటికొండ రాజు, తాటికొండ రంజితుల జ్ఞాపకార్థం తనకు ఇష్టమైన ఆరాధ్యదైవమైన దేవుడైన శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవ విగ్రహాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, ఉప అర్చకులు పాతర్లపాటి రవీందర్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Related posts

హన్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ను సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు

స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి