జై భారత్ వాయిస్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా::మైలవరం పట్టణంలో వేంచేసియున్న శ్రీ కంచి కామాక్షిసమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానము నందు దివ్య మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు.ఈ ప్రతిష్ట మహోత్సవంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారిని, దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.బాలా త్రిపుర సుందరి, శ్రీచక్రము, ఏకాంబరేశ్వర స్వామి, సిద్ధి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంట నాగులు, కాలభైరవ, నవగ్రహాల దివ్య ప్రతిష్ఠా మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు .యంత్రాలకు అభిషేకం, వైకల్యహోమం, వస్తుపూలు, యంత్రస్థాపన దేవతా మూర్తుల ప్రతిష్ట, పూర్ణబింతి, జయాదిహోమం, తీర్ధప్రసాద వితరణ గావించారు. స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
previous post