ఏలూరు: ఆగష్టు 20 :జై భారత్ వాయిస్ ‘న్యూస్ ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు ద్వారకా తిరుమలలో నాయీ బ్రాహ్మణులకు కల్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించమని గతంలోనే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు ఆదేశించి 20 రోజులైనప్పటికిని ఈరోజు వరకు స్థలం కేటాయించక పోవటంపై ద్వారకా తిరుమల ఎంఆర్వో సుబ్బరావును ఏలూరులోని ఎంపీ స్వగృహంలో పనుల జాప్యంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. స్థలం కేటాయింపుకు ఇంకా ఏవైనా రెవెన్యూ శాఖపరమైన అడంకులు ఉంటె తమ దృష్టికి తీసుకవరావాలని, వచ్చే వారం రోజుల్లో నాయీ బ్రాహ్మణులకు కల్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎమ్మార్వోను ఆదేశించారు
