ఏలూరు : ఆగష్టు, 20:జై భారత్ వాయిస్ న్యూస్ గత నెలలో దేవరపల్లిలో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరగా దానిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు రైతులకు 15 కోట్లు, రాష్ట్రం లో ఉన్న లక్ష మంది పొగాకు రైతులు 110 కోట్లు లబ్ది పొందారన్నారు.2023-24 పంట సీజన్‌లో ఫ్ల్యూ క్లూరుడ్ పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్ 142.00 మిలియన్ కిలోల నుండి 2024-25 పంట కాలంలో ఫ్ల్యూ క్లూరుడ్ పొగాకు సాగు కోసం 167.00 మిలియన్ కిలోల పంట పరిమాణాన్ని పెంచింది.ā సబ్సిడీ లో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (SOP) ని రైతులకు అందించేందుకు టొబాకో బోర్డు ప్రయత్నిస్తుంది .