Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఆఫ్టల్ బియాభాని దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య సమీక్ష సమావేశం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-హనుమకొండ ఐ డి ఓ సి కార్యాలయంలో ఖాజిపేట హాజ్రాత్ సయ్యద్ షా ఆఫ్టాల్ బియబాని దర్గా, ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. వారం రోజులపాటు సాగె ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో నగర్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, దర్గా పిఠాధిపతి ఖుసృ పాషా, జి డబ్ల్యూ ఎంసి కమిషనర్ తానజీ వాకడే మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ముఖ్యంగా ఉత్సవాల ఏర్పాట్లకు విద్యుత్తు శాఖ, నీటి సరఫరా, ఆర్ అండ్ బి, వైద్య శాఖ, పోలీస్ శాఖ, ట్రాఫిక్, రైల్వేశాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన ఆటుపోట్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజా రవాణా అధికంగా సాగుతునే తరుణం కాబట్టి ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి ఉత్సవం కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు, హేమరపాటు నిశితంగా ఉన్న సహించేది లేదన్నారు. ఈ సమావేశలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Related posts

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి

రక్తదానం చేయండి.. ప్రమాదాలు గాయపడ్డ వారిని రక్షించండి-కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి