జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21
దుగ్గొండి మండలం తొగర్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులుకి సాహిత్యాభి లాష ఎక్కువే, చదివింది, భోదించేది సాంఘికశాస్త్రం అయినప్పటికీ తెలుగు భాష పైన మక్కువ, మమకారంతో రచన రంగం లోనూ రాణిస్తున్నారు.
చిలువేరు శ్రీనివాసులు తల్లిదండ్రులు:కీ.శే.చిలువేరు.ఆగయ్య,సారమ్మ,భార్యామణి:ఉమారాణి,కుమార్తె:అక్షయ,కుమారుడు:అవినాశ్.కుటుంబ సభ్యుల సహకారంతో తన సాహిత్యతృష్ణను చాటు కుంటున్నారు. ఉపాధ్యాయుడు వృత్తి,సాహిత్య రచనలు, కళారంగం, సామాజిక, సేవా రంగం, ప్రవృత్తి వ్యాసాంగంలోనూ ఉన్నత పురస్కారాలు అందుకుంటున్నారు.
ప్రస్థానం ఇలా..
చిలువేరు శ్రీనివాసులు వరంగల్ జిల్లా,నర్సంపేట మండలం, సర్వాపురం గ్రామంలో ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి జీవితంలో ఎన్నో కష్టాలు,ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు,చదివింది ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, బి.ఎడ్,సేట్, సాంఘిక శాస్త్రం అంకితభావంతో చేపట్టిన విధులకుగానూ పొందిన పురస్కారాలు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (మంగపేట)-2014,తెలంగాణ వారోత్సవాలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2014,స్వామి వివేకానంద అవార్డు -2015, సావిత్రిబాయి పూలే అవార్డు -2015,ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2016,మథర్ థెరీసా అవార్డు – 2017 అందుకున్నారు.
చిలువేరు శ్రీనివాసులు కలం నుంచి జాలువారిన కవితా సంపుటాలు
“చిలువేరు చైతన్య గీతాలు”, “బడిబాట కవిత సంకలనం”, “పల్లె దీపాలు పాటలు”, Srinu poet శ్రీను కవి యూట్యూబ్ ఛానల్ చదువు పాటలు విద్యార్థులు- చదువుపై చైతన్యం తీసుకరావడం పై అప్లోడ్ చేయడం జరిగింది. ‘బ్రతుకు మారాలన్న మెతుకు దొరకాలన్న ఉన్నది ఒకటే మార్గం చదువుతూనే అది సాధ్యం పాట’,’సాధన చేయములే సాధించని దుండదులే అనే పాట’, ‘విద్యార్థి.. ఓ విద్యార్థి.. చదువులో కావాలి నువ్వు ప్రసిద్ధి పాట’. లాంటి కవితా సంపుటాలు, గీత సంపుటిలు, లేదా సంపుటిలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి పలు సాహితీ సంస్థలు సత్కరించారు. బడిబాట కవిత సంకలనం అనే సరళ వచన కవితలు సంపుటిని కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాసినట్లు తెలిపారు. మొత్తం 1000 వచన కవితలు నాలుగు లైన్లకు ఒక వచన కవితలు చొప్పున ఒక్కో లైన్లో మూడు పదాలతోనే అర్థవంతమైన వచన కవితలు రాయడం తనకు మంచి గుర్తింపు నిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో త్వరలో వచ్చే పుస్తకాలు “ఆదర్శ ఉపాధ్యాయుడు” “సామాజిక కథలు”,బోధన, పాఠశాల నిర్వహణ,రచనా వ్యాసాంగంలో మరింత రాణించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా చిలువేరు శ్రీనివాసులు వివరించారు.