జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21
తల్లిదండ్రులు క్రీడల్లో రాణిస్తున్న తమ పిల్లలను ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో రాణించిన చిన్నారులను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం అభినందించారు. గత నెల 19 నుండి 21 తేది వరకు జాతీయ అండర్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా అధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించిన 7వ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వరంగల్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భిక్షపతి తనయులైన కట్ల ధీరజ్ సాయి, కట్ల వేధాంశ్ లు ఇద్దరు ఈ పోటీల్లో స్వర్ణ, రజిత పతాకాలను సాధించారు. ఇందులో వేధాంశ్ ఫ్రీ స్టైల్ విభాగం స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ధీరజ్‌సాయి మిక్సిడ్ విభాగంలో రజిత పతాకాన్ని గెలుచుకొని థాయిలాండ్‌లో నిర్వహించబడే ఇంటర్‌నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్బంగా పతకాలను గెలిచిన చిన్నారులకు పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి ఉన్నత విధ్య అభ్యసించడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం సులభమవుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపి సురేష్‌కుమార్, ఆర్.ఐ స్పర్జన్ రాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్ పాల్గోన్నారు.