Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21
ప్రస్తుతం వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ పిలుపునిచ్చారు.బుధవారం నాడు కాశిబుగ్గ దేశాయి పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన మలేరియ వ్యాధిగ్రస్తుని ఇంటిని క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాల తెలుసుకున్నారు. మరియు అక్కడ నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రస్తుతం సీజనల్ వ్యాధులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది ఇంటింటి కీ తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించి రక్ష పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి దోమల ద్వారా మరియు నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షణ పొందాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది సహకారంతో నీటి నిలువ ఉన్న ప్రాంతాలలో దోమల నివారణ మందు పిచికారి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు జిల్లాలో అదుపులోనే ఉన్నాయని, ప్రజలు వ్యాధుల పట్ల భయభ్రాంతులకు గురికాకుండా జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని తెలిపారు.
ఈ సందర్భంగా నమోదైన మలేరియా వ్యాధిగ్రస్తుని ఇంటి చుట్టుపక్కల ఆల్ఫా సైఫర్మెత్రిన్ అనే దోమల నివారణ మందు పిచికారి చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కిరణ్, డాక్టర్ భరత్, ఇంచార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్లు అజయ్, విజయేంద్ర కుమార్, హెల్త్ సూపర్వైజర్లు సదానందం, మధుకర్, సి ఓ జన్ను కోర్నెల్, వైద్య సిబ్బంది ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

షరతుల్లేకుండా రుణ మాఫీ చేయాలి..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,

గీసుకొండలో భగవద్గీత పారాయణం

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ