జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు21
సంగెం మండలం గవిచర్ల, రైతు వేదికలో ఉద్యాన శాఖ&రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ సాగు బిందుసేద్య నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట యొక్క ప్రాముఖ్యత సాగు విధానం, విస్తీర్ణం ఇప్పటివరకు కంపెనీ పరిధిలో5700 ఎకరాలు పంట సాగు చేస్తున్నారని ఈ సంవత్సరం 2000 ఎకరాలకు రైతులను మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులుగాఎంపిక చేసి, 700 ఎకరాలకు నాన్ సబ్సిడీ రైతు వాటా ను సేకరించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఈ ఒక్క ఆయిల్ పామ్ పంటకు మాత్రం ఆయిల్ పామ్ ఆక్ట్ ఉందని రైతులకు తప్పని సరిగా బై బ్యాక్ సౌకర్యం ఉందని , దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫ్యాక్టరీ కి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ నెక్కొండ మండలంలో 30 ఎకరాలు కొనుగోలుకు అంగీకారం చేయించుకోవడం జరిగింది, అతి త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది అని తెలిపారు.జిల్లా ఉద్యాన&పట్టు పరిశ్రమ శాఖ అధికారిసంగీత లక్ష్మి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటకు ఈ జిల్లాలో అనువైన నేలలు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయనితెలియజేశారు, ఈ పంటకు ఆయిల్ పామ్ ఆక్ట్ ప్రకారం బై బ్యాక్ సౌకర్యం కలదని, ఆయిల్ పామ్ పంటలో అంతర పంటలు వేసుకోవడం వలన 4 సంవత్సరాల వరకు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చనిప్రకృతి వైపరీత్యాల వలన పంటకు ఎలాంటి నష్టం జరగదన్నారు , జిల్లాలో పట్టా భూమి నీటి వసతి కలిగిన రైతులందరూ ఆయిల్ పామ్ సాగుకు దరఖాస్తు చేసుకోగలరని తెలియజేశారు. నెటాఫిమ్ అగ్రోనమిస్ట్సుబ్బారావు గారు మాట్లాడుతూ బిందుసెద్య నిర్వహణ, బిందుసెద్య పరికరాల ద్వారా ఎరువుల యాజమాన్యం(ఫెర్టిగేషన్), మోతాదులు మరియు ఆసిడ్ ట్రీట్మెంటు విధానం గురించి ఆయిల్ పామ్ రైతులకు పూర్తిగా అవగాహన కల్పించారు.వరంగల్ ఉద్యాన అధికారి తిరుపతి ఉద్యాన అధికారి టెక్నికల్ శ్రీ రాకేష్ , ఉద్యాన అధికారులు, ఆయిల్ పామ్ క్షేత్ర అధికారులు, KN బయో క్షేత్ర అధికారులు , డ్రిప్ ఇరిగేషన్ డిసిఒలు,ఎఫ్ సిఒలు గూడ సుదర్శన్ రెడ్డి , దౌల్తాబాజీ గోవర్ధన్ , గూడ బుచ్చి రెడ్డి , కడుదురి చంద్రయ్య ఆయిల్ పామ్ సాగు రైతులు పాల్గొన్నారు.