జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 21ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురు, మానవతావాది . రవిశంకర్ వారి ప్రపంచ ప్రసిద్ధ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధ్వర్యంలో 6 రోజుల హ్యాపీనెస్ ప్రోగ్రామ్ హన్మకొండ వడ్డేపల్లి, TNGO కాలనీ లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో జరిగింది.ఆనందోత్సవ్ పేరిట పాన్-ఇండియా మొత్తం జరిగిన ఈ కార్యక్రమంలో 26000 వేల మంది ద్యానం, సుదర్శన క్రియ ప్రాణాయామం నేర్చుకున్నారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ రమణ ప్రసాద్, మంజుల బోధించిన ఈ తరగతులకు ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు ఔత్సహితులైన 28 మంది పాల్గొన్నారు.శారీరక మానసిక ఒత్తిడి నుండి బయటపడి అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ ఉత్సహమైన జీవితాన్ని సాగించటం, వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల్లో సమన్వయం అనేవి ఈ కోర్స్ ద్వారా సాద్యమవుతుందని ఫ్యాకల్టీ రమణ ప్రసాద్ పేర్కొన్నారు.కోర్స్ హాజరైన సభ్యులు మాట్లాడుతూ ఈ కోర్సు వల్ల కేవలం 6 రోజుల్లోనే ఒత్తిడి తగ్గి వారి ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల చూశామని, శక్తి, ఉత్సాహం, సంతోషం చవిచూసామని అనందోద్వేగలతో పేర్కొన్నారు. ఇలాంటి కోర్సులు మరెన్నో జరగాలని అందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమం ఆదివారం నాడు ముగుస్తుందని తెలిపారు