రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 నర్సంపేట డివిజన్ ప్రతినిధి:-
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నా ప్రారంభం చేయడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఏలాంటి ఆటంకాలు లేకుండా అందరికీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు మరియు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు, పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎండి పాషా దేవుడు తిరుమల సదానందం గందె రజిత చంద్రమౌళి రామ సాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి ముఖ్య నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహ రాములు క్లస్టర్ ఇన్చార్జులు మచ్చిక నరసయ్య, మోటూరి రవి, తాళ్ల పెళ్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్ రెడ్డి, కడారి కుమారస్వామి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కుమ్ముల కరుణాకర్ కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు వాసం కరుణ వార్డు అధ్యక్షులు బీరం నాగిరెడ్డి బాబు పైసా ప్రవీణ్ ఆబోతు రాజు రాయరాకుల సారంగం రావుల సతీష్ పెరమండ్ల రవి పెరమండ్ల ప్రభాకర్ రెడ్డి పి వెంకటేశ్వర్లు దొంగల సురేష్ శివరాత్రి స్వామి మేడిద శ్రీనివాస్ పట్టణ పార్టీ నాయకులు తోట సుదర్శన్ సాంబయ్య, పట్టణ యువజన సంఘం నాయకులు తరిగొప్పుల రణదీష్, పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నల్ల రవీందర్ అన్ని గ్రామాల మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్స్ మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు పట్టణ నాయకులు అన్ని అనుబంధ సంఘాలు, వార్డు అధ్యక్షులు కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు.
