Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

– బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ 

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

 

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు జరుగుతున్న కూడా పట్టించుకోవడంలేదని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్యాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబాద్ జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తి వేధింపులు తాళలేక ఆత్మ చేసుకున్న యువతి ఆత్మ శాంతించాలని అంటే యువకున్ని ఎన్కౌంటర్ చేయాలన్నారు. కాలేజీలో యువతులకు రక్షణ లేదు, వైద్యులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యార్థి ఆత్మహత్యకు కారకుడు అయిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని అప్పుడే విద్యార్థులకు రక్షణ ఉంటుందన్నారు. కాలేజీల్లో విచ్చలవిడిగా రాగింగ్ చేస్తున్న కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళ వైద్యులకు రక్షణ కల్పించాలని వారికి రాత్రి వేళ డ్యూటీ వెయ్యద్దన్నారు. వైద్య కాలేజీలతో పాటు హాస్పటల్లో కూడా రక్షణకల్పించాలన్నారు. బిజెపి పార్టీ మహిళలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బయ్య పైడి కళ్యాణ్,బిజెపి జిల్లా నాయకులుభయ్యా మాలగం, పాల్గొన్నారు

Related posts

వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్

బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి