అంగవైల్యం పిల్లలకు వసతి గృహం ఆడిటోరియం పార్క్ పనులకు భూమి పూజా ఎమ్మెల్యే ఎంపీ కుడా చైర్మన్
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ డివిజన్ ప్రతినిధి:- ఆగష్టు 23
అన్యాక్రాంతాల్లో ఉన్న పార్క్ లకు పునఃవైభవం తీసుకువస్తాం. హైద్ర తరహా మాదిరిగా మహానగరంలో డీసీపీ స్థాయి అధికారిని నియమించ బోతున్నాం పార్క్ అవరణాల్లో ఆసాంఘిక కలాపాలకు చోటు లేకుండా చూడాలి. హనుమకొండ బాలసముద్రం లోని 30 వ డివిజనులో చిల్డ్రన్స్ పార్క్ ఆవరణలో 15 వ ఆర్థిక సంఘం రూ. 2 కోట్ల నిధులతో నిర్మించబోతున్న అంగవైకల్య పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్క్ సుందరికరణ కోసం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం కుడా చైర్మన్ మాట్లాడుతూ. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ, నిర్ణత సమయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిర్మాణ చేపట్టే ప్రదేశాన్ని పరిశీలించారు. పార్క్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా చెట్లను పరిరక్షించేలా ప్రణాళికలను ఉంచాలని కోరారు. పార్క ఆవరణ మొత్తం కలియాతిరిగి పరిశీలించారు, పార్క్ ఆవరణలో ఎపుగా పెరిగిన పిచ్చిమొక్కలను వెంటనే తీసేయలని అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు. నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే కనీస బాధ్యత మనపై ఉందని అన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ తరహా హైద్ర అక్రమ కట్టడాల నిర్మలకు డీసీపి అధికారిని నియమించ బోతున్నామని అన్నారు. తద్వారా పట్టణంలో ఖాబ్జాలకు గురైన పార్క్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రయివేట్ స్థలాలకు విముక్తి కానుంది. మహా నగరంలో ఉన్న భద్రకాలీ బండ్, పద్మక్షమ్మా గార్డెన్, ఏకాశీల పార్క్, పబ్లిక్ గార్డెన్ ఇతర పార్క్ ఆవరణలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ శాఖ వారికీ ఖచ్చితమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వాకార్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.