(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపిటిసి నత్తి కోర్నెల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నత్తి కోర్నెల్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కు వరంగల్ ఎంపీ కడియం కావ్య, టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెసు పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
previous post