Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

 

జై భారత్ వాయిస్ న్యూస్ ఏలూరు : ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు విజయవంతం అయ్యాయని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు భవిష్యత్తులో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సర్వతోముఖ అభివృద్దే లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్ది స్వర్ణ గ్రామాలుగా తయారుచేయడానికి ఈ గ్రామసభలు తలమణికంగా మారానున్నాయని డీపీఓ అన్నారు. 2030 సంవత్సరం నాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెయ్యాలని వ్యవసాయ, పారిశ్రామిక, సేవ రంగాలకు చేయూతను ఇచ్చి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో తయారు చెయ్యాలని పిలుపునిచ్చారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్ (డిజిడిపి)68686 కోట్లతో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని, ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం 15 శాతం ఆర్ధిక అభివృద్ధి మెరుగు పర్చుకుంటూ అభివృద్ధిలో ఏలూరు జిల్లా ముందువరసలో ఉండాలని, ఆ దిశగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చెయ్యాలని డీపీఓ కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి సాధించవచ్చని అధికారులు శాఖల సమన్వయంతో ప్రభుత్వం సూచించిన 4 థీమ్స్ సంబందించిన పనులు గుర్తించాలని తెలిపారు. అభివృద్ధి అంటే నాలుగు గోడలు మధ్య జరిగే చర్చ కాదని ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య బద్దంగా వారికీ కావలిసిన అవసరాలపై సమగ్ర చర్చ జరిపి తీర్మానించుకొని అమలు చేసే ప్రక్రియని అది గ్రామసభ ద్వారా మాత్రమే జరుగుతుందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లా గ్రామసభలకు సుమారు 5 లక్షల మంది ప్రజలు స్వచ్చందంగా హాజరయ్యారని అన్నారు. ముందుగా ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు నమోదు చేసారు. వట్లూరు, అప్పన్నవీడు, రాజుపేట గ్రామసభలలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడిన మాటలకు విశేష స్పందన వచ్చింది.

Related posts

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) సేవలు అభినందనీయం ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్

KATURI DURGAPRASAD

చనుబండ లో 2 వ రోజు పెన్షన్ బుర్రే శేఖర్ పంపిణి

KATURI DURGAPRASAD

ఫ్ల్యూ క్లూరుడ్ వర్జీనియా(FCV) పొగాకు రైతులు ఎదుర్కొంటున్నా వివిధ సమస్యలకు పరిష్కార గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

KATURI DURGAPRASAD