జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 24
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలరూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్, రోడ్డు మరమ్మత్తుల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.స్థానిక కాలనీ వాసులతో ముచ్చట్టించారు, రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని, దూరద్రుష్టితో రోడ్డు పనులకు అటకం లేకుండా చూడాలని తెలిపారు.శంకుస్థాపన చేసిన పనులను సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వార్డులో నీళ్ల (పాత పైపుల వలన) సమస్య ఉంది అని మహిళలు తెలియజేయడంతో వెంటనే తక్షణ మరమ్మత్తులకు నిధులను కేటాయించారు.అనంతరం వార్డులో ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్, నల్లబోలు సతీష్, డివిజన్ అధ్యక్షురాలు స్రవంతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రవణ్, సతీష్, కాలనీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, సురేష్, వేణు, రమేష్, వెంకటేశ్వర్లు, బంక రాకేష్, యూత్ నాయకులు రాకేష్, సత్యనారాయణ, ప్రశాంత్, శుభాష్, సీనియర్, కాంగ్రెస్ పార్టీ సీనియయ్ నాయకులు, మహిళా నాయుకురాళ్లు, యువజన నాయకులు, కాలనీ వాసులు, అధికారులు పాల్గొన్నారు.
previous post