జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 హన్మకొండ ప్రతినిధి:-
అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటినుంచి నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిత్యం ప్రజలమధ్యనే ఉంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్యాంప్ కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వరంగల్ పశ్చిమ ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. క్షేత్ర స్థాయి నుంచే ప్రక్షాళన జరపి, పనిచేసిన వారికే పట్టం. అన్యాయాన్ని సమర్థించేది లేదు, తప్పుచేస్తే నావరైన ఉపేక్షించేదిలేదు. పార్టీ, ప్రభుత్వం జోడేడ్ల మాదిరి నడిపించాలి. 28 నుంచి వార్డుల్లో క్షేత్ర స్థాయిలో, అధికారులతో పర్యటన. దేశంలోనే 11 ఏళ్ళు సుదీర్ఘ డీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిన కొత్త వారికీ అవకాశం ఇవ్వాలని అధిష్టాననికి తెలియజేసిన ఏకైక వ్యక్తినని అన్నారు.
కొత్త ఓటర్ల నమోదు, ఓట్ల మార్పులో అందరికీ అవగాహన కల్పించాలి. పదేళ్ల సుదీర్ఘ పోరాటాల నడుమ కార్యాకర్తల శ్రమ, ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికే పదవులు ఉంటాయని హనుమకొండ జిల్లా అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ఏర్పడిన 8నెలల తరువాత మొదటి సారి సమావేశం నిర్వహించు కుంటున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధికారం కోసం, నా గెలుపుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో సమూచిత స్థానాలు ప్రభుత్వ పరమైనవి, పార్టీ పరమైనవి కల్పిస్తానని అన్నారు. ప్రజలు మనకు అనితర భాద్యతలు ఇచ్చిన తరుణంలో కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని తెలిపారు. అందరికీ ఒకేసారి పదవులు రాకపోయినా ఎవరు అధైర్య పడవద్దని, పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించి భాద్యతలు కల్పస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దేశంలోనే ఎక్కువ రోజులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగానని, ఇప్పుడు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టాననికి తెలియజేశనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదలను డివిజన్ వారీగా నివేదికలు తయారుచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కావ్య గెలుపులో భారీ మెజారిటీ ఇవ్వడం పట్ల ఏఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. పరిపాలన పరమైన ప్రణాళికలు, పార్టీ అభివృద్ధి రెండు కూడా సమావుజ్జిగ సాగాలని కోరారు. పార్టీలో స్థాయిని బట్టి పదవులు, ప్రతి రెండు లేదా మూడు ఏళ్లకు ఒకసారి ఉంటాయన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ డివిజన్ అధ్యక్షులు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకత్వంలోనే పార్టీ యొక్క అభివృద్ధి కీలకంగా ఉంటుందని, వారి యొక్క పనితనం మెరుగ్గా లేకుంటే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిళ్ళుతుందన్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని, ప్రజా సమస్యల నిర్ములన కోసం నేనెప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈ వి శ్రీనివాస్ రావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్ లు పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్, మానస రాంప్రసాద్, మామిండ్ల రాజు, సయ్యద్ విజయశ్రీ రజాలి, ఏనుగంటి రాములు, మాజీ కార్పొరేటర్లు, బుద్ధ జగన్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బోడ డిన్న, నాగరాజు, అశోక్, రావుల సదానందం, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అజిజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అనుబంధ సంఘాల అధ్యక్షులు బంక సరళ, పెరుమాండ్ల రామకృష్ణ, అజిజ్ ఉల్లా బేగం, పల్లకొండ సతీష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, అంకుస్, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేరీ, సరళ, కొంటె సుకన్య, స్రవంతి, రహీమున్నిసా మరియు డివిజన్, వార్డు అధ్యక్షులు, యువజన సంఘలా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
