Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓరుగల్లులో ఈనెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్: హనుమకొండ ఆగస్టు24
యాదవ కులదైవమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని వేద బంకేట్ హాల్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో పాటు సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ యాదవ్, సభ్యులు కలిసి ఆవిష్కరించారు. ఈనెల 26న హానుమకొండలోని డి-కన్వెన్షన్ హాల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా గొల్ల-కురుమ సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయన్నారు. ప్రపంచమంతా శ్రీకృష్ణ మార్గాన్ని అనుసరిస్తున్నారని.. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దేవుడుఅయితే యాదవులకు కుల దైవమని ఆయన పేర్కొన్నారు. శ్రీకృష్ణ డిఎన్ఏ ఒక్కటే… యాదవుల డిఎన్ఏ ఒక్కటేనన్నారు. వరంగల్ వేదికగా శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని మా యాదవ కులబంధువులలో పెంపొందించడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలకు కేంద్రమంత్రి,రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్, రాజ్యసభ సభ్యులు,స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. “శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. యాదవులు కుటుంబ సమేతంగా, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో, ఇండోర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. అవుట్ డోర్‌లో యూత్ రాక్ స్టార్స్ ప్రదర్శనలు, ఉట్టిగొట్టే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, వేడుకలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుత్తురు రవి యాదవ్, సిద్దిరాజ్ యాదవ్, కెంచ కుమారస్వామి యాదవ్, బండి పర్వతాలు యాదవ్, బూరం ప్రశాంత్ యాదవ్, ఉడుత తిరుపతి యాదవ్, బోయిన బిక్షపతి యాదవ్, బుట్టి శ్యామ్ యాదవ్, కత్తుల సహదేవ్ యాదవ్, బండి సాంబయ్య యాదవ్, మహేష్ యాదవ్, వంశి యాదవ్, నాగరాజు యాదవ్, రాణా యాదవ్, యశ్వంత్ యాదవ్, సతీష్ యాదవ్, ప్రమోద్ యాదవ్, రాకేష్ యాదవ్, మామిండ్ల సురేష్ యాదవ్, వినయ్ యాదవ్, రాజు యాదవ్, సాయి కుమార్ యాదవ్, సంతోష్ కుమార్ యాదవ్, సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Sambasivarao

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

చెరువు కట్ట పనులు ప్రారంభం

Ashok