జై భారత్ వాయిస్ న్యూస్ ఓరుగల్లు ఆగస్టు 24
గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ లోని గోల్డెన్ ఓక్ స్కూల్లో శనివారం
రోజున శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకుని స్కూల్ చైర్మన్ శ్రీ గంటా రవి కుమార్ ప్రోత్సాహం మార్గదర్శకత్వంలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.విద్యార్థిని-విద్యార్థులు కృష్ణుడు, రాధ,గోపికలు కృష్ణుడి జీవితంలోని ఇతర పాత్రల వలె దుస్తులు ధరించి, కృష్ణుని బాల్యం యొక్క కథలు, అతని దైవిక దోపిడీలు మరియు భగవద్గీత నుండి అతని బోధనలను ప్రదర్శించే నృత్య ప్రదర్శనలు, స్కిట్‌లు మరియు పారాయణాలను నిర్వహించారుఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్ఛేసి విద్యార్థిని -విద్యార్థుల యొక్కకార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. కరెస్పాండంట్ శ్రీ విజయ్ కుమార్ మాట్లాడుతు శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథినాడుభారతదేశంలోని అన్ని ప్రాంతాలలో చాలా ఆనందంతో జరుపుకుంటారని, శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం ఎత్తి, ప్రపంచాన్ని చెడు నుండి రక్షించడానికి మరియు అన్ని కష్టాలను తొలగించడానికి శ్రీకృష్ణుడు జన్మించాడని, శ్రీకృష్ణుడు వెన్న లేదా మఖన్‌ను ప్రేమించే వాడని అందుకే, ఈ రోజున, ప్రజలు వెన్న ఉపయోగించి చాలా ఆటలు ఆడతారని. మట్టి కుండలు పగలగొట్టి బాల కృష్ణ లాగా వ్యవహరిస్తారని. శ్రీకృష్ణుడు వెన్న తినడానికి కుండలను పగలగొట్టినట్లు, పిల్లలు వెన్నతో నిండిన కుండలను పగలగొట్టి అదే విధంగా ఆడతారని. ఈ ఆటలతో పాటు, ప్రజలు ఈ రోజును అర్ధరాత్రి పూజతో జరుపుకుంటారని, బాల కృష్ణ ప్రతి ఇంటిలో జన్మించినట్లుగా భావించి,ప్రజలు వివిధ మిఠాయిలు, కిచడీలు పంపిణీ చేస్తారని,పండుగ ప్రాముఖ్యత గురించి వివరిoచారుఈ వేడుక సందర్భంగా మన జీవితాన్ని మనం ఎలా నడిపించాలో శ్రీకృష్ణ భగవానుడి జీవిత చరిత్ర నుండి మనము నేర్పుకోవాలనీ విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ మనోహర్ రావు ఉపాధ్యాయిని-ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
